Category archives for: State

చావుకైనా రెడీ.. నేను నిలబడాలి..!

01-baby (1)

ప్రీతికుమారి రాయ్.. సిటీ ఢిల్లీ.. ఆడిపాడే  పదిహేడేళ్ళ వయసున్న అందమైన టీనేజర్.. కానీ.. ఆమెకు ఎనిమిదో  ఏట నుంచే కంజెంటియల్ స్కోలియోసిస్ అనే జబ్బు సోకింది. ఫలితంగా ప్రీతి వెన్నెముక వంకర తిరిగిపోయింది. దీని కారణంగా ఆమె నిఠారుగా నిలబడలేదు. విపరీతంగా బాధపడుతోంది. ఇప్పటిదాకా పదిమంది డాక్టర్ల దాకా ప్రీతి కుమారిని పరీక్షించారు. ఆమెకు ఆపరేషన్ చేసేందుకు నో అన్నారు. అయినా ప్రీతి తన ప్రయత్నాలను మానలేదు. చివరకు ఒక డాక్టర్ ప్రీతికి ఆపరేషన్ చేసేందుకు రెడీ అన్నాడు. […]

మూడేళ్ల బాలుడుని బోరుబావి మింగేసింది..!

Dead-01

మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెంలో బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు రాకేష్ ఇకలేడు. ఆ చిన్నారిని రక్షించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 33 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్టు గుర్తించిన వారు.. శనివారం రాత్రంతా రక్షణ చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. ఆదివారం ఉదయం ఆరున్నర గంటలకు బోరుబావి నుంచి రాకేష్ మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో ఆ ప్రాంతమంతా విషాదం నెలకొంది. రాకేష్ ప్రాణాలతో బయటపడతాడని ఆశతో ఎదురుచూసిన అతని తలిదండ్రులు సాయిలు, మొగులమ్మ […]

గవర్నర్ నరసింహన్‌కు కొపమొచ్చిందా..?

Governor-01

తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌కు కొపమొచ్చిందా? మీడియా అంటే ప్రజలకు గురువు వంటిదని, మంచి విషయాలు నేర్పించాల్సిన బాధ్యత వారికి వుందని అన్నారు. హైదరాబాద్ ప్రెస్‌‌క్లబ్ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న గవర్నర్… కొన్ని విషయాల్లో మీడియా వ్యవహరిస్తున్నతీరును గుర్తు చేశారు. తాను గుడికి వెళ్లినా, ఫ్యామిలీని ఎయిర్‌పోర్టుకు వెళ్లినా రకరకాలుగా స్టోరీలను అల్లేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ పదుల సంఖ్యలో కేంద్రానికి నివేదికలు ఇచ్చానని, ఆ కాపీ మాకు ఇవ్వండంటూ మీడియా ప్రతినిధులు […]

మెదక్ జిల్లాలో బోరు బావి లో పడిపోయిన బాలుడు..!

boy-fallen-

సాగు నీటి కోసం పొలాల్లో తవ్విన బోరుబావులు చిన్నారుల పాలిట యమపాశాలుగా మారిపోతున్నాయి. ఇలాంటి ఘటనలు తరచు జరుగుతూనే వున్నాయి. తాజాగా జనావాసాల మధ్య తవ్విన ఓ బోరు బావి సమీపంలో ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడు అందులో పడిపోయాడు.ఈ ఘటన మెదక్ జిల్లా బొమ్మారెడ్డి గూడెంలో చోటు చేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన వెంటనే పేరెంట్స్.. స్థానికుల సహాయంలో బాలుడ్ని బయటకు తీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం కూడా సహాయక చర్యలను ప్రారంభించింది.

దాని కోసం ఆగితే…కోట్ల క్యాష్‌ వ్యాన్‌తో ..!

Chori-0101

ఈ మధ్యకాలంలో ఏటీఎం చోరీలు అధికమయ్యాయి. కొన్ని బ్యాంకులు భద్రత పెంచి చోరీల నివారణకు చర్యలు చేపడుతున్నాయి. ఐనా ఏటీఎంలో నుంచి డబ్బులు ఎత్తుకుపోవడం, డ్రైవర్లు క్యాష్ వ్యాన్‌తో ఎస్కేప్ కావడం జరుగుతూనే వున్నాయి. తాజాగా ఢిల్లీలో ఏకంగా ఏటీఏంలో జమ చేయాల్సిన క్యాష్ వ్యాన్‌తో పరారయ్యాడు ఓ డ్రైవర్. ఈ ఘటన దేశ రాజధానిలో సంచలనం రేపింది. గురువారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో దక్షిణ ఢిల్లీ గోవింద్పురిలోని యాక్సిస్ ఏటీఎంకు క్యాష్‌ వ్యాన్‌ వెళ్తోంది. […]

పంచలోహ శివలింగం కథ సమాప్తం..!

statue-recovered--01

అరుదైన పంచలోహ శివలింగమది. 87 వజ్రాలు పొదిగి ఉన్నట్టు చెబుతున్న ఈ లింగానికి అయిదు తలల నాగేంద్రుడితో కూడిన అదనపు ఆకర్షణ కూడా ఉంది. ఎక్కడ నుంచి తెచ్చారో (?) గానీ అయిదుగురు వ్యక్తులు ఈ విగ్రహాన్ని అమ్మజూపారు.విజయవాడలోని కేదారేశ్వరపేటకు చెందిన నరసింహారెడ్డి, వెంకటదుర్గాప్రసాద్, శివనాగేంద్ర, వెంకన్నబాబు, శ్రీను ఈ విగ్రహం గురించి వాట్సప్ ద్వారా అందరికీ సమాచారం పంపారు. దీని విలువ రూ.8 కోట్ల నుంచి రూ. 10 కోట్లవరకు ఉంటుందని ప్రచారం చేశారు. ఓ […]

రాజయ్య కోడలు సారిక కేసులో కొత్త నిజాలు..!

twist-01

సంచలనం సృష్టించిన వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె పిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) తేల్చేసింది. గ్యాస్ లీక్ వల్ల వ్యాపించిన మంటల కారణంగానే శరీరాలు కాలిపోయినట్టు తేల్చారు. దీంతో సారిక, ఆమె ముగ్గురు పిల్లల మరణంపై ఉన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను తయారు చేసి జిల్లా అధికారులకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు ఎఫ్‌ఎస్‌ఎల్ ఆఫీసర్స్. ఈ నెల 4న హన్మకొండ రెవెన్యూ కాలనీలోని రాజయ్య […]

బాహుబలి సెట్‌తో ఎన్నారై కూతురుకు మ్యారేజ్..!

55-cr-wedding-for-NRIs-daughter-in-Kerala-id1_1448516377

తన కూతురుకు మ్యారేజ్ ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాడు ఓ ఎన్నారై. అందుకోసం సినిమా తరహాలో 55 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారట. ఇంతకీ ఆ ఎన్నారై ఎవరు? కేరళలో మ్యారేజ్ ఎందుకు చేయాలని అనుకున్నాడు? స్టోరీలోకి వెళ్తే.. కేరళకు చెందిన రవి పిళ్లై.. అరబ్ దేశాల్లో పేరొందిన బిజినెస్ మెన్. గల్ఫ్‌లో కన్‌స్ర్టక్చన్, ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్, మైనింగ్, ఎడ్యుకేషన్ వంటి వ్యాపారాలు చేస్తున్నారు.ఆర్‌పీ గ్రూప్‌కి బాస్. 26 కంపెనీలున్న ఈ గ్రూప్‌లో దాదాపు 80 వేల మంది […]

కాఫీ 5 పైసలు..ఉప్మా 20 పైసలు..?

Hotel-01

కస్టమర్స్‌ని ఆకట్టుకోవడం కోసం అప్పుడప్పుడు కొన్ని హోటల్స్ బంపరాఫర్లు ప్రకటిస్తుంటాయి. అతి తక్కువ ధరలకే స్పెషల్ వంటకాలు రుచి చూడవచ్చంటూ బోర్డులు పెట్టేస్తాయి. ఈ తరహాలోనే ముంబైలో ‘కేఫ్ మద్రాస్’ ఓ భారీ ఆఫర్‌ ప్రకటించింది. 5 పైసలకు.. కాఫీ, 20 పైసలకే ఉప్మా, 60 పైసలకే మూడు ఇడ్లీలు. ఎప్పుడు 50 రూపాయల పైగానే అయ్యే టిఫిన్ ఖర్చు.. ఈ హోటల్ ఇంత తక్కువకు ఇవ్వడం వెనుక కారణాలపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఈ […]

జూబ్లీహిల్స్ రోడ్ నెం1 లో కారు దగ్ధం..!

th (2)

జూబ్లీహిల్స్ రోడ్ నెం1 లో ఉన్నఫళంగా కారు దగ్ధమైంది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. అకస్మాత్తుగా చెలరేగిన మంటలను గమనించి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. తర్వాత మంటలు కారంతా వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు స్పందించి నీళ్లు చల్లి మంటలను ఆర్పేప్రయత్నం చేశారు. ఇవే ఆ దృశ్యాలు.

Recently Added

Random Gallery

nayanatara3 tamanna6 richa-gangopadhyay06 nata-cultural-event46 image19 poonam-kaur2 krishnam-vande-jagadgurum-10 ccl-calendar-11 16

Mirapa Monthly Archives

Translate

EnglishFrenchGermanItalianPortugueseRussianSpanish

Photo Gallery

Log in