Category archives for: Politics

‘జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు’

JC-Diwakar-Reddy

హైదరాబాద్: సంచలన వ్యాఖ్యలకు మారుపేరైన అనంతపురం తెలుగుదేశం నాయకుడు, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. జగన్ తీరు మార్చుకోకుంటే ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని అన్నారు. అనంతపురంలో ఇవాళ జరిగిన నీరు-ప్రగతి కార్యక్రమంలో మాట్లాడుతూ, జగన్‌పై జేసీ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చెడ్డపేరు తేవాలన్న ఒకే ఒక లక్ష్యంతో జగన్ పనిచేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమకు నీళ్ళు వద్దంటే జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని విమర్శించారు. జగన్ తన సమయాన్ని […]

‘వైజాగ్‌ కాల్‌గర్ల్స్‌’ హైటెక్‌ వ్యభిచారం

1451386865-1246

విశాఖలో సీతంపేట కేంద్రంగా హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు మంగళవారం రట్టు చేశారు. ద్వారకాజోన్‌ పోలీసులు వలపన్ని ఈ బృందాన్ని అరెస్టు చేశారు. వీరిని అరెస్టు చేసిన పోలీసులు వీరు వ్యభిచారం నిర్వహిస్తున్న తీరుతో షాక్‌ అయ్యారు. ఈ హైటెక్‌ వ్యభిచారంలో ప్రముఖ పాత్ర పోషించిన హైదరాబాద్‌ అమీర్‌పేటకు చెందిన నీలకంఠారెడ్డి ‘వైజాగ్‌ కాల్‌గర్ల్స్‌’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేశాడు. అందులో తనను అఖిల్‌గా పరిచయం చేసుకుని కాంటాక్టు ఫోన్‌ నంబర్‌ను ఉంచాడు. […]

నడిరోడ్డులోనైనా ఆడవాళ్లు బట్టలు మార్చుకోవచ్చు

1451380722-1986

మారుతున్న కాలంలో జీవితం ఎంత వేగవంతమైపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మగాళ్లయితే ఏదోరకంగా మానేజ్‌ చేసేస్తారు. ఎక్కడో రెస్టు రూంలో క్షణాల్లో చొక్కా ఫ్యాంటు మార్చుకుంటారు. కానీ, ఆడవాళ్లకు ఆ సౌలభ్యం లేదు. దుస్తులు మార్చుకోవడానికి సమయం పడుతుంది… అంతేకాదు, అన్ని చోట్లా అనుకూలమైన వసతి ఉండకపోవచ్చు. నిత్యం బిజీగా ఉండే చాలామంది మహిళలు కార్లలోనే దుస్తులు మార్చుకుంటుంటారు. ఒక్కోసారి బాత్రూంల్లోనూ మార్చుకుంటుంటారు. కానీ, ఆ పద్ధుతులేవీ సురక్షితం కాకపోవచ్చు. దీంతో అలాంటి ఇబ్బందులు తప్పించడానికి కొత్త […]

ఫోన్‌ కాల్‌తో టికెట్‌ రద్దు

Ticket-01

ప్రయాణికుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న రైల్వేశాఖ, మరో అడుగు ముందుకేసింది. వినియోగదారులు తమ టికెట్లను రద్దు చేసుకోవటానికి ఇకపై కౌంటర్ల చుట్టూ తిరగనక్కర్లేదు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే టికెట్ క్యాన్సిల్ ఐపోయింది. ఈ విధానాన్ని జనవరి 26 అమల్లోకి తీసుకురావాలని ఆ శాఖ భావిస్తోంది. టికెట్లను రద్దు చేసుకోవాలనుకున్నప్పుడు 139 నెంబరుకు ఫోన్‌ చేసి రిజర్వేషన్‌ పేపర్‌లో పేర్కొన్న సెల్‌ నెంబర్‌ తెలపాలి. దానికి ఆ ఫోన్‌కు వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ వస్తుంది. దానిని రైల్వే […]

చంద్రబాబుపై బీజేపీ గుర్రు

BJP-Angry-with-Chandrababu-Naidu-over-Reservations-1450957758-1526

మతం మారిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్ కల్పిస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు నవ్యాంధ్ర ప్రభుత్వంలోనే చిచ్చు రాజేసే అవకాశాలు కల్పిస్తున్నాయి. చంద్రబాబు ప్రకటనపై ఇప్పటికే బీజేపీ – ఆరెస్సెస్ వర్గాలు మండిపడుతున్నాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా రిజర్వేషన్లపై గగ్గోలు రేగుతుంటే ఇప్పుడు చంద్రబాబు మరో వివాదాన్ని రేకెత్తించారని విమర్శిస్తున్నాయి. మత మార్పిళ్లు మరింత పెరిగేలా దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ ఎలా కల్పిస్తారని ఆరోపిస్తున్నాయి. నిజానికి నవ్యాంధ్రలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ. ఆ పార్టీ అధ్యక్షుడు […]

అసెంబ్లీలో జగన్ ఫెయిల్

Jagan-Fails-To-Expose-Call-Money-Issue-in-Assembly-1450957620-1331

నవ్యాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది మొదలు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి వరుసగా విఫలమవుతూనే ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరగడానికి ముందు శాసనసభలో చర్చించడానికి అవకాశాలు పండులా వస్తున్నాయి. వాటిని చర్చించాలని ప్రతిపక్షం కూడా సిద్ధమవుతోంది. కానీ అసెంబ్లీలో అధికార పక్షం ఎత్తులకు చిత్తవుతోంది. అసెంబ్లీ సమావేశాల చివరికి వచ్చేసరికి ముఖం వేలాడేస్తోంది. గతంలో ఎన్నో సందర్భాల్లో ఇదే జరిగింది. ఇప్పుడు మరోసారి పునరావృతం అయింది. అసెంబ్లీ సమావేశాలు మరో పది రోజుల్లో […]

సంక్రాంతికి కోళ్ళు రెడీ

cock-03

సంక్రాంతి దగ్గర పడుతోంది. గొబ్బెమ్మలూ, హరిదాసుల కీర్తనలూ సరేసరి.. వీటికన్నా కోళ్ళ పందాల గురించి చెప్పుకోకపోతే అసలీ పండుగ సందడే లేదు. రకరకాల కోళ్ళను అప్పుడే పందాలకు సిద్ధం చేస్తున్నారు పందెం రాయుళ్ళు.. కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర..ఇలా ఏపీలో ఎక్కడ చూసినా కోళ్ళకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోతోంది. వేర్వేరు రకాల పేర్లతో పిలుస్తున్న కోళ్ళ అమ్మకాన్ని చాలామంది ఆన్‌‌లైన్‌‌లో పెట్టేస్తున్నారు. అలాగే వాటి ధరలు కూడా వేలలో పలుకుతున్నాయి. సామాన్యుడి నుంచి ప్రముఖులు, రాజకీయనాయకుల వరకు అందరికీ […]

జగన్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీనుంచి సస్పెండ్ చేసిన స్పీకర్

Kodela_Sivaprasada_rao_5649

వైఎస్ జగన్మోహన్ రెడ్డితోసహా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ ఏపీ అసెంబ్లీనుంచి స్పీకర్ కోడెల శివప్రసాదరావు సస్పెండ్ చేశారు. కాల్‌మనీ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ వైసీపీ ఎమ్మెల్యేలందరూ స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేయటం వంటి పనులతో సభా కార్యకలాపాలకు అడ్డుపడుతుండటంతో వీరిని సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించారు. వారందరి పేర్లు చదివిన స్పీకర్, అంబేద్కర్‌పై చర్చ పూర్తయ్యేంతవరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా కూడా వైసీపీ ఎమ్మెల్యేలు సభను వీడకుండా పోడియం […]

అసెంబ్లీ నుంచి ‘వైసీపీ’ సస్పెన్షన్‌

assembly_ddd1450417346

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాల రెండో రోజూ ‘కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌’ ప్రకంపనలు సృష్టించింది. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్‌పై చర్చ జరగాల్సిందేనని అధికార పక్షం, అంతకన్నా ముందు కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌పై చర్చ జరగాలని ప్రతిపక్షం పట్టుబట్టడంతో ఉదయం నుంచీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. వాస్తవానికి నిన్ననే కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌పై చర్చ జరగాల్సి వుందనీ, అయినా అధికార పక్షం తప్పించుకు తిరుగుతోందనీ, అత్యంత ప్రాముఖ్యత గలిగిన కాల్‌ మనీ సెక్స్‌ […]

టీడీపీ ఎమ్మెల్యే వద్ద దొరికింది 18 కాదు రు. 48కోట్లు

Rajender-Reddy

హైదరాబాద్: ఆదాయపు పన్నుశాఖ దాడులలో నిన్న మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు రాజేందర్ రెడ్డివద్ద రు.18 కోట్లు దొరికాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ మొత్తం రు.18 కోట్లు కాదని, రు.48 కోట్లని తాజా సమాచారం. బుధవారం ఉదయంనుంచి రాత్రి పొద్దుపోయేవరకు ఈ దాడులు జరిగాయని, గురువారం ఉదయం ఐటీ అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకుని రాయచూర్(కర్ణాటక)లోని ఎమ్మెల్యే నివాసానికి తాళం వేసినట్లు తెలుస్తోంది. రాజేందర్ రెడ్డి నవోదయ గ్రూప్ పేరుతో […]

Random Gallery

nata-cultural-event23 ram-charan-vinayak-movie-launch-photos-11 aadis-new-movie-stills8 bezawada-premier-show-photos-3 namitha-item-song-hot-photos_16_0 9 5 10 1

Mirapa Monthly Archives

Translate

EnglishFrenchGermanItalianPortugueseRussianSpanish

Photo Gallery

Log in