Category archives for: National

సూపర్ స్టార్ రజనీ పై కోర్టు కేసు..?

pizap.com14480033093781

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా కోర్టు చిక్కులో పడినట్లు తెలుస్తోంది. ఓ పీఎంకే నేత ఈ సూపర్ స్టార్ న్యాయమూర్తులను కించపరిచారని ఆరోపిస్తూ కోర్టులో కేసు వేశారు. అంతేకాకుండా రజనీకాంత్ పై చర్య తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు. అసలు విషయంలోకి వెళితే, కొన్నిరోజుల క్రితం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రజనీకాంత్ అక్కడ మాట్లాడుతూ.. దేశంలో రాజకీయాలు భ్రష్టుపట్టినా, ప్రజలు చెడ్డవాళ్ళుగా మారినా న్యాయమూర్తులు నిజాయితీతో వ్యవహరిస్తే దేశం బావుంటుందని […]

విమానంలో వెకిలి చేష్టలు.. ముగ్గురు అరెస్టు..!

indigoarrest

విమాన సిబ్బందితో తప్పుగా ప్రవర్తించిన కారణంగా ముగ్గురు ప్రయాణికులను తమిళనాడులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన వివరాలిలా ఉన్నాయి. ఇండిగోకు చెందిన విమానం కోయంబత్తూర్ నుంచి చెన్నై వెళ్తోంది. విమానంలో ప్రయాణికుల్లో ముగ్గురు వ్యక్తులు విమాన క్యాబిన్ సిబ్బందితో పాటు తోటి మహిళా ప్రయాణికులను తమ చేష్టలతో, అమర్యాదగా ప్రవర్తించారు. తోటి మహిళ ప్రయాణికుల చిత్రాలు తీసేందుకు యత్నించారు. వీరి ప్రవర్తనతో విసిగిన విమాన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు ముగ్గురిని […]

సోడా-క్యాన్ బాంబుతోరష్యా విమానం పేల్చివేత..!

canbomb

ఇది చూడ్డానికి సాధారణ సోడా టిన్. కానీ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మాత్రం దీన్నే బాంబుగా వాడుకున్నారు. ఈజిప్టులోని సినాయ్‌లో కూలిన రష్యా విమానాన్ని ఐసిస్ ఉగ్రవాదులు ఈ సోడా క్యాన్‌తోనే పేల్చారట. ఆ దుర్ఘటనలో 224 మంది ప్రయాణికులు మరణించారు. సాధారణ సోడా టిన్‌గా కనిపిస్తున్న ఓ ఫోటోను కూడా ఐసిస్ ఉగ్రవాదులు తమ అధికారిక దబిక్ వెబ్‌సైట్‌లో పెట్టారు. దాంతో పాటు రష్యా విమానాన్ని పేల్చేందుకు వెళ్లిన టెర్రరిస్టులు పాస్‌పోర్టులను కూడా ఆ వెబ్‌సైట్‌లో […]

ఈనంబర్ల ఫోన్ ఎత్తారో.. మీ పని గోవిందా..!

cell1119

మీ మొబైల్ ఫోన్‌కు అపరిచిత నంబర్‌ను నుంచి కాల్ వస్తే ఎత్తే ముందు కాస్త ఆలోచించండి. నెంబరేదో ఫ్యాన్సీగా ఉందని ఎత్తారో జేబులు ఖాళీ కావడం ఖాయం! ప్రీపెయిడ్ అయితే పర్వాలేదు. కానీ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ అయితే.. హల్లో అన్నందుకు సుమారు 2 వేలు (30 డాలర్లు) చెల్లించాల్సిందే! ప్రధానంగా +371, +381, +375 నంబర్ సిరీస్‌తో వచ్చే కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) హెచ్చరిస్తున్నది. +375602605281, +37127913091, +37178565072 నంబర్లతో […]

రాందేవ్ నూడుల్స్ కు పర్మిషన్ లేదట..

pizap.com14479062536211

యోగా గురువు రాందేవ్ బాబాకు సంబందించిన పతంజలి సంస్థ కొత్తగా నూడుల్స్ ను తయారు చేస్తోంది. రాందేవ్ బాబా కూడా దానికోసం ప్రమోషన్లు నిర్వహిస్తున్నాడు. కానీ బుదవారం ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా'(FSSAI) మాత్రం పతంజలి తయారుచేస్తున్న నూడుల్స్ కు ప్రభుత్వం ఇచ్చే అప్రూవల్ లేదని తెలిపింది. FASSAI చైర్ పర్సన్ ఆశిష్ బహుగుణ మాట్లాడుతూ ‘పతంజలి ఉత్పత్తి చేస్తున్న ఇన్స్టంట్ నూడుల్స్ కు అప్రూవల్ తీసుకోలేదు. వాళ్ళు కేవలం పాస్తాను తయారుచేయటానికి మాత్రమే […]

కదులుతున్న రైలులో నుంచి వ్యక్తిని తోసేసిన లేడీ కానిస్టేబుల్..

RPF-CONSTABLE

ఉట్టర్‌పారా-హిండ్ మోటార్ స్టేషన్ సమీపంలో కదులుతున్న రైలు నుంచి లేడీ కానిస్టేబుల్ ఓ వ్యక్తిని తోసేసింది. ఈ ఘటనలో 40ఏళ్ల దీపక్ శర్మ అక్కడికక్కడే మృతి చెందాడు. కోల్‌కతాకు చెందిన దీపక్ శర్మ యూపీ హౌరా-బందేల్ మాతృభూమి లేడీస్ స్పెషల్ సబర్బన్ రైలులో ప్రయాణిస్తున్నాడు. దీంతో అక్కడున్న ఆర్‌పీఎఫ్‌కు చెందిన లేడీ కానిస్టేబుల్ దీపక్ తోసేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు, ప్రయాణికులు హిండ్ మోటార్ స్టేషన్ సమీపంలోకి […]

సలసల కాగే నూనెలో గంటె సహాయం లేకుండా ఉత్త చేతుల్తో పకోడీలు..!

PAKODI

వంట చేయడానికి కాసేపు పొయి ముందు నిలబడాలంటేనే భరించలేనంత వేడి ఉంటుంది. వంట పాత్రలో గంటె తిప్పాలంటేనే ఒక్కోసారి చేయి చురుక్కుమంటుంది. అలహాబాద్‌లో గంటె సహాయం లేకుండానే పకోడీలు చేసే రాంబాబును చూస్తే నోరు వెళ్లబెట్టడమే కాకుండా వాటిని చేయడం ఇంత సులభమా అనిపిస్తుంది. వేడిగా.. సలసల కాగే నూనెలో రాంబాబు ఏకంగా చేతులు పెట్టి పకోడీలు చేయడం అలహాబాద్ చుట్టపక్కల ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 200 సెంటీగ్రేడ్ వేడి ఉన్న నూనెలో ఉత్త […]

భారత్‌కు చేరిన గీత ఇష్యూలో బిగ్ ట్విస్ట్..!

geeta01

పాకిస్థాన్ నుంచి భారత్‌కు చేరిన గీత వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆమె బీహార్‌లోని జనార్థన్ మహతో కూతురు కాదని డీఎన్‌ఏ టెస్టుల్లో తేలింది. దీంతో ఆమె పేరెంట్స్ ఎవరు? అనేది బిగ్ క్వొశ్చన్. ఈ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత గీత తమ అమ్మాయేనంటూ నాలుగైదు కుటుంబాలు మీడియా ముందుకొచ్చాయి. దీంతో డీఎన్ఏ టెస్ట్‌ నిర్వహించడంతో గీత అసలు పేరెంట్స్ మహతో ఫ్యామిలీ కాదని నిర్ధారణ ఐపోయింది.బీహార్‌లోని సహర్సా ప్రాంతానికి చెందిన జనార్థన్ మహతో వయసు […]

పోటీగా పతంజలి ఉత్పత్తులు..!

ram-dev-baba

యోగా గురువు రాందేవ్ బాబా తమ ఉత్పత్తులతో మార్కెట్ ను ఒక ఊపు ఊపడానికి సిద్ధమైనట్లు కనిపిస్తుంది. ఇప్పటికే ఇతర నూడిల్స్ కు పోటీగా పతంజలి నూడిల్స్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే విధంగా మరికొన్ని ఉత్పత్తులను మార్కెట్ లోకి త్వరలోనే తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ప్రముఖ స్పోర్ట్స్ వేర్ దుస్తుల మాదిరిగా పతంజలి యోగావేర్ దుస్తులు తయారు చేయనున్నారని సమాచారం. అదే విధంగా సౌందర్య సాధనాలు, ఆరోగ్య పానీయాలు, బేబీకేర్ […]

అంతరిక్షం నుంచి దక్షిణ భారతదేశం..!

south-india

అమెరికన్ వ్యోమగామి స్కాట్ కెల్లీ దాదాపు 233 రోజుల నుంచి అంతరిక్షంలో ఉంటూభూమి మీద ఉన్న వివిధ ప్రాంతాలను పై నుంచి పరిశీలిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే స్కాట్.. మార్చి నుంచి అంతరిక్షంలోని అంతర్జాతీయ స్పేష్ స్టేషన్లో ఉంటూనే, తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రపంచంలోని పలు ప్రాంతాల ఫోటోలను పై నుంచి తీసి, కింద మనకు పంపుతున్నారు. ఈ నేపధ్యంలో స్కాట్ తాజాగా అలాంటి బహుమతి ఒకటి మనకు ప్రత్యేకంగా పంపించారు. తాజాగా స్కాట్ దక్షిణ భారతదేశం ఎలా […]

Recently Added

Random Gallery

delhi_highcourt_blast5 panchi-bora08 ayisha-takia09 supriya-5 jacqueline-neha-at-press-meet-10 ntr-birthday-special-posters-from-ramaiya-vastavaiya-movie-3 bhoo-prapancham-movie-stills-4 13 2

Mirapa Monthly Archives

Translate

EnglishFrenchGermanItalianPortugueseRussianSpanish

Photo Gallery

Log in